Friday, November 22, 2024
HomeTrending Newsడెల్టా ప్లస్ వాస్తవాలు - అపోహలు

డెల్టా ప్లస్ వాస్తవాలు – అపోహలు

డెల్టా ప్లస్ ఇమ్యూన్ ఎస్కేప్ అని .. వాక్సిన్ వేసుకొన్న వారు , తోలి వేవ్ లో,  రెండో వేవ్ లో కరోనా సోకిన వారు కూడా సేఫ్ కాదని దీని వల్ల మారణహోమం జరగనుందని ఎక్కువ ప్రచారం జరుగుతోంది .

దీనికి సంబంధించి ఇప్పటిదాకా అందులోబాటులో ఉన్న సమాచారం ..

ఇది మార్చ్ నెలలోనే ఇంగ్లాండ్ లో కనిపించింది. జూన్ నెలలో ఇంగ్లాండ్ లో మొత్తం 36 డెల్టా ప్లస్ కేసులు గుర్తించారు. ఇందులో 18 మంది అసలు వాక్సిన్ వేసుకోని వారే. మరో 16 మంది కేవలం సింగల్ డోసు వాక్సిన్ తీసుకొన్న వారు. 36 మందిలో ఒక్కరూ మరణించలేదు.

మధ్య ప్రదేశ్ లో మొత్తం అయిదు డెల్టా ప్లస్ కేసులు కనుగొన్నారు. ఇందులో నలుగురు వాక్సిన్ తీసుకొన్న వారు కాగా వారికి ఏమీ కాలేదు. ఐదో వ్యక్తి ఉజ్జయినికి చెందిన వాడు. అతను వాక్సిన్ తీసుకోలేదు. అతను మరణించాడు.

ఇక కేరళ లో ముగ్గురిలో డెల్టా ప్లస్ వైరస్ కనిపించింది. ఇందులో నాలుగేళ్ళ పిల్లవాడు, ఇద్దరు యాభై ఏళ్ళు దాటిన మహిళలు, ముగ్గురూ సులభంగా దీని బారి నుంచి బయటపడ్డారు .

మహారాష్ట్ర లో ఈ వైరస్ వేరియంట్ ను గత సంవత్సరం డిసెంబర్ నెలలోనే గుర్తించారని NDTV చర్చ లో దేశముఖ్ అనే డాక్టర్ చెప్పారు .

డెల్టా వేరియంట్ నేపాల్ లో పురుడు పోసుకొందని మరో అభిప్రాయముంది. నేపాల్ లో మే నెల రెండవ వారం నుంచి కేసులు తగ్గిపోతున్నాయి. అక్కడ కేసులు – మరణాల నిష్పత్తి చూస్తే మిగతా దేశాల్లో వున్నటే వుంది. అసాధారణ స్థాయిలో మరణాలు లేవు.

ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే జాల్నా, రత్నగిరి జిల్లాలో ఈ వేరియంట్ కేసులు కనిపించాయి. ఆ రెండు జిల్లాల్లో కూడా ఇప్పుడు అతితక్కువ స్థాయిలో కేసులు వస్తున్నాయి .

కాగడా పెట్టి ప్రపంచమంతా వెదికినా ఈ డెల్టా ప్లస్ వారియంట్ వాక్సిన్ లకు చిక్కదు. టి సెల్స్ కు దొరకదు. సోకినవాడు సోకినట్టే పోతాడు అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క ఆధారం దొరకడం లేదు. కొంత మంది  శాస్త్రవేత్తలు ఇది మూడో వేవ్ తెస్తుంది అని చెప్పడానికి వాక్సిన్ ల కు దొరకదు అని చెప్పడానికి ఇప్పుడు ఉన్న డేటా సరిపోదు అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్