Saturday, January 18, 2025
HomeTrending Newsమయన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ– యుఎన్

మయన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ– యుఎన్

మయన్మార్లో ప్రజా ఆందోళనలను అణచివేస్తున్న జుంట పాలకుల వైఖరిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. మిలిటరీ పాలకుల అరాచాకాలను వ్యతిరేకిస్తూ యుఎన్ సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మెజారిటీ దేశాలు సమర్ధించాయి. 193 దేశాలు ఓటింగ్లో పాల్గొనగా 119 దేశాలు  మిలిటరీ పాలనను వ్యతిరేకించాయి. మయన్మార్ లో ప్రజాస్వామ్యం పునరుద్దరించాలని మెజారిటీ దేశాలు కోరాయి.

ఐక్యరాజ్యసమితి భద్రత మండలి మయన్మార్ అంశంలో జోక్యం చేసుకోవాలని సాధారణ సభ తీర్మానం చేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి ప్రధాని అంగ్ సాన్ సూకీని నిర్భందించటం దారుణమని ఆందోళన వ్యక్తం చేసింది. శనివారం న్నాటికి సూకికి 76 ఏళ్ళు నిండాయని ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని మయన్మార్ లో యుఎన్ రాయబారి క్రిస్టిన బర్గనేర్ ఆందోళన వెలిబుచ్చారు.

మరోవైపు మయన్మార్ లో ప్రజల నిరసనలను మిలిటరీ పాలకులు పట్టించుకోవటం లేదు. తిరుగుబాటు ద్వారా చేజిక్కించుకున్న పాలనా పగ్గాల్ని సుస్థిరం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మిలిటరీ పాలకుడు మిన్ ఆంగ్ హైలంగ్ రష్యా పర్యటనకు వెళ్లారు. రేపటి నుంచి అంతర్జాతీయ భద్రత అంశంపై  జరుగుతున్న సమావేశంలో జుంట నేత పాల్గొంటారు. రష్యా రక్షణ శాఖ రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పాల్గొనటంతో పాటు ఆయుధాల కొనుగోలు పై ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని సమాచారం.

ఫిబ్రవరి లో అంగ్ సాంగ్ సూకీ ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత మిలిటరీ పాలకులు ఇతర దేశాల్లో పర్యటించటం ఇది రెండోసారి. అంతకు ముందు ఆసియన్ దేశాల సమావేశాల్లో పాల్గొనేందుకు జుంట నేత హైలంగ్ ఇండోనేషియా వెళ్ళారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చిన మిలిటరీ పాలకులకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు నిరసన తెలిపాయి. అయితే చైనా, రష్యా , ఆసియన్ దేశాల కూటమి కొంత సంబంధాలు కొనసాగిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్