Friday, March 6, 2026
Homeసినిమాఓటీటీ డేట్ సెట్ చేసుకున్న 'డిమోంటి కాలనీ 2'

ఓటీటీ డేట్ సెట్ చేసుకున్న ‘డిమోంటి కాలనీ 2’

తమిళంలో ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదలై విజయాన్ని సాధించిన సినిమాల జాబితాలో ‘డిమోంటి కాలనీ 2’ ఒకటిగా కనిపిస్తుంది. అరుళ్ నిధి – ప్రియా భవాని శంకర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఆగస్టు 15వ తేదీన అక్కడి థియేటర్లలో విడుదలైంది. తెలుగు అనువాదం ఆగస్టు 23వ తేదీన ప్రేక్షకులను పలకరించింది. ఓ మాదిరి బడ్జెట్ లో నిర్మితమైన  సినిమా, 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది.

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ‘జీ 5’ వేదికపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సినిమాను తమిళ .. తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. విజయ్ సుబ్రమణియన్ – రాజ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు.  సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నడుస్తుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.

కథలోకి వెళితే .. డెబ్బీ – శామ్యూల్ ప్రేమించుకుంటారు. కలిసి బ్రతకాలని నిర్ణయించుకుంటారు. అయితే ఊహించని విధంగా శామ్యూల్ ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అలా ఎందుకు చేశాడనేది డెబ్బీకి అర్థం కాదు. కారణమేమిటనేది కచ్చితంగా తెలుసుకోవాలని ఆమె అనుకుంటుంది. అందుకు కోసం ఆమె చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? ఆ ప్రయత్నంలో ఆమెకి తెలిసే నిజాలేమిటి? అనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular