Johar : Rosaiah
రాజకీయ దిగ్గజం కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. తమిళనాడు గవర్నర్ గా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన రోశయ్యకు తెలంగాణా ప్రభుత్వం పూర్తి అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, లోక్ సభ సభ్యుడిగా చట్టసభల్లో పనిచేసిన అరుదైన నేత రోశయ్య అజాత శత్రువుగా అన్ని పార్టీన నేతల అభిమానం చూరగొన్నారు. అందుకే పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు అయనకు నివాళి అర్పించేందుకు పెద్ద సంఖ్యలో అయన నివాసానికి వచ్చారు.
నిన్న మరణించిన రోశయ్య భౌతిక కాయాన్ని నేటి ఉదయం అయన స్వగృహం వద్ద అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన అనంతరం గాంధీ భవన్ కు తరలించారు. అక్కడినుంచి కొంపల్లి లోని అయన ఫార్మ్ హౌస్ కు తరలించి అక్కడ అంతిమ క్రియలు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తరఫున రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే హాజరై రోశయ్యకు నివాళులర్పించారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున ముగ్గురు మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరై రోశయ్య కు నివాళులర్పించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని కూడా రోశయ్యకు శ్రద్ధాంజలి ఘటించారు.