Sunday, January 19, 2025
HomeTrending Newsవైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎండి.రుహుల్లా

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎండి.రుహుల్లా

MLC Candidate: త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ  ఉపఎన్నికల్లో  వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్సీ కరీమున్నిసా తనయుడు రుహుల్లాను పార్టీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు.  సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ చేతుల మీదుగా ఎండి.రుహుల్లా బిఫామ్‌ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రుహుల్లా తండ్రి మహ్మద్‌ సలీమ్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కరీమున్నీసా పార్టీ విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో 56వ డివిజన్ నుంచి గెలిచి కార్పొరేటర్ గా పని చేశారు, 2021 మార్చిలో సిఎం జగన్ ఆమెను శాసన సభ్యుల కోటాలో మండలికి పంపారు. నవంబర్ 19న ఆమె గుండెపోటుతో మరణించారు. దీనితో ఆ ఖాళీ ని ఆమె కుటుంబ సభ్యులతోనే  భర్తీ చేయాలని సిఎం నిర్ణయించారు. ఆమె కుమారుడైన రుహుల్లాకు అవకాశం కల్పించారు.

శాసనమండలి సభ్యుడిగా రుహుల్లా ఎన్నిక లంఛనమే కానుంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్