Tuesday, March 19, 2024
HomeTrending Newsస్వతంత్ర శాఖగా...వికలాంగుల సంక్షేమం

స్వతంత్ర శాఖగా…వికలాంగుల సంక్షేమం

తెలంగాణ దివ్యాంగులకు తీపి కబురు.ఇప్పటి వరకు స్త్రీ సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉన్న దివ్వాంగుల మరియు వయోజన సంక్షేమ శాఖా ఇకపై స్వయం ప్రతిపత్తితో పని చెయ్యనున్నది.స్త్రీ సంక్షేమ శాఖ నుండి దివ్వాంగుల శాఖను వేరు చేయడం ద్వారా దివ్వాంగుల మరియు వయోజన సంక్షేమానికి సత్వర నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇందుకోసం రాష్ట్ర యస్ సి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోడ్పాటుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రత్యేకంగా చర్చించారు. దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ మాట నిల పెట్టుకున్నారు. స్త్రీ శిశు సంక్షేమ వయోజన సంక్షేమ శాఖగా ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేకంగా వికలాంగులు వయోవృద్ధుల శాఖగా మార్చారు.
డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబులిటీ సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్ జెండర్స్ పర్సన్స్ వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ప్రభుత్వ ఉత్తర్వు 33, 34 జారీ చేయడం జరిగింది.

వికలాంగుల సంక్షేమ శాఖ ఇక నుండి స్వతంత్ర శాఖగా వ్యవహరించనున్నది. దివ్యాంగుల సంక్షేమ శాఖ స్వతంత్ర శాఖ ఏర్పాటు చేసినందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. రేపు ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా ఒకరోజు ముందుగానే ప్రభుత్వం ఉత్తరువు జారీ చేయడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

వికలాంగులు, సీనియర్ సిటిజన్లు & ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సమర్థవంతమైన సేవలను అందించడానికి జిల్లా స్థాయిలో వికలాంగులు & సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖను మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ నుండి వేరు చేయడం జరిగింది.

వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం అసిస్టెంట్ డైరెక్టర్/జిల్లా హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ యొక్క కేటగిరీని వికలాంగులు, సీనియర్ సిటిజన్లు & ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం జిల్లా సంక్షేమ అధికారిగా తిరిగి నియమించడం జరుగుతుంది.

అందుబాటులో ఉన్న క్యాడర్ స్ట్రెంత్‌ను పునఃపంపిణీ చేయడానికి ప్రభుత్వం అవసరమైన ఉత్తర్వులు జారీ జారీ చేయనున్నది

మహిళా & శిశు సంక్షేమం మరియు వికలాంగుల సంక్షేమం మధ్య జిల్లా మధ్య ప్రతి జిల్లాకు డిపార్ట్‌మెంట్ మరియు వర్కింగ్ అరేంజ్‌మెంట్ చేయనున్నది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్