Saturday, March 7, 2026
Homeసినిమాతెలుగులో 'దేవర'లాంటి సినిమా రాలేదు: కల్యాణ్ రామ్

తెలుగులో ‘దేవర’లాంటి సినిమా రాలేదు: కల్యాణ్ రామ్

ఎన్టీఆర్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ‘దేవర’పైనే ఉంది. ‘RRR’ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో, అందరూ కూడా ఈ సినిమా ఎంతవరకూ వచ్చిందనేది తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం మరింతగా అందరిలో కుతూహలాన్ని పెంచుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, కల్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి కల్యాణ్ రామ్ స్పందించాడు. ‘దేవర’ సినిమా షూటింగు దాదాపు 80 శాతం పూర్తయింది. మిగతా 20 శాతం చిత్రీకరణ కూడా చాలా వేగంగానే కంప్లీట్ చేస్తాము. ఈ సినిమా సెట్ కి నేను తరచూ వెళుతూనే ఉంటాను. అక్కడి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను. కొరటాల ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. ఆ సినిమా కోసం తమ్ముడు పడుతున్న కష్టం చూసి నేనే ఆశ్చర్యపోయాను” అని అన్నాడు.

ఈ సినిమా .. విజువల్స్ పరంగా ఆడియన్స్ కి పండగ చేస్తుందని నేను బలంగా చెప్పగలను. అందుకోసం ఉపయోగిస్తున్న టెక్నాలజీ ప్రతి ఒక్కరినీ అలా కూర్చోబెట్టేస్తుంది. నాకు తెలిసి తెలుగులో ఇలాంటి ఒక సినిమాను ఇంతవరకూ ఎవరూ చూసి ఉండరు. ఇది నేను గొప్పగా చెబుతున్నానని అనుకున్నవారికి, సినిమా చూసిన తరువాత అర్థమవుతుంది. తప్పకుండా ఈ ఇది తమ్ముడి కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అవుతుంది” అని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular