Friday, April 4, 2025
HomeTrending Newsఓయూలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఓయూలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రూ. 39.50 కోట్ల వ్య‌యంతో నిర్మించ‌నున్న బాయ్స్ హాస్టల్ భవనానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ క‌లిసి భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప్ప‌ల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ సుర‌భి వాణిదేవీ, ఓయూ వీసీ ర‌వీంద‌ర్ యాద‌వ్, ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ లింబాద్రితో పాటు ఓయూ ప్రొఫెస‌ర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీలో అత్యాధునిక వసతులతో 2.76 ఎకరాల్లో రూ.39.50 కోట్ల అంచనా వ్యయంతో, 1,06,292 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. 3 అంతస్థుల్లో 500 మంది విద్యార్థులకు వసతి కల్పించే ఈ హాస్టల్‌ను ఏడాదిలోపు అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఓయూలో 24 హాస్టళ్లు ఉండగా, ఇందులో బాయ్స్‌ (12), ఉమెన్స్‌ (12). వర్సిటీలో 70శాతానికి పైగా అమ్మాయిలే ఉండటంతో బాలుర హాస్టల్‌ను గతేడాది అమ్మాయిలకు కేటాయించారు. అబ్బాయిలు ఉండేందుకు హాస్టళ్లు లేకపోవడంతో నూతన హాస్టల్‌ నిర్మాణానికి టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ అధికారులు టెండర్లు పూర్తిచేశారు.

Also Read: చేనేతపై జీఎస్టీ ఉపసంహరించుకోవాలి: మంత్రి తలసాని

RELATED ARTICLES

Most Popular

న్యూస్