Thursday, March 28, 2024
HomeTrending Newsబిజెపి నేత బిఎల్ సంతోష్ కు హైకోర్టులో ఉపశమనం

బిజెపి నేత బిఎల్ సంతోష్ కు హైకోర్టులో ఉపశమనం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా బిజెపి నేత బీఎల్ సంతోష్ ను అరేస్ట్ చేయొద్దని హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో అరెస్ట్ చేయకుండా సంతోష్ కు స్టే ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా హైకోర్ట్ అందుకు నిరాకరించింది. బిఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో  బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులు జారీచేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్  దాఖలు చేశారు. కేసును పర్యవేక్షిస్తున్న సింగిల్ జడ్జి అనుమతి పొందిన తర్వాతే సిట్ నోటీసులు జారీ చేయాలని పేర్కొంటూ.. నోటీసులపై స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్‌లో ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ,  సైబారాబాద్ పోలీస్ కమిషనర్, ఏసీపీ రాజేంద్రనగర్, సీహెచ్‌వో మొయినాబాద్, సెంట్రల్ హోమ్ ఎఫైర్స్, సీబీఐ, రోహిత్ రెడ్డిలను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు.

కుట్రలో భాగంగానే ఆయనకు 41ఏ కింద నోటీసులు ఇచ్చారని ఆరోపించింది. బీఎల్ సంతోష్, లాయర్ శ్రీనివాస్కు నోటీసుల్లో ఒకే సెల్ నెంబర్ పెట్టారని చెప్పారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వాళ్లను వేధించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సిట్‌‌ నోటీసులపై స్టే ఇవ్వాలని.. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు.

Also Read: బిజెపి,తెరాస,కాంగ్రెస్ లు స్వార్థ పార్టీలు షర్మిల

RELATED ARTICLES

Most Popular

న్యూస్