Friday, March 20, 2026
Homeసినిమా‘డ్యాడీస్‌ హోమ్’ లో దేవి శ్రీ ప్రసాద్‌ బ‌ర్త్ డే

‘డ్యాడీస్‌ హోమ్’ లో దేవి శ్రీ ప్రసాద్‌ బ‌ర్త్ డే

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ త‌న పుట్టిన‌రోజు (ఆగ‌స్ట్‌2)ను గన్నవరంలోని డ్యాడీస్‌ హోమ్ అనాథాశ్ర‌మంలో జ‌రుపుకున్నారు. రెండు ద‌శాబ్దాలుగా ద‌క్షిణాది, బాలీవుడ్ చిత్రాల‌కు సంగీతాన్ని అందిస్తూ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న మ‌న రాక్‌స్టార్ ఈ ఏడాది పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు అనాథ పిల్ల‌ల‌తో కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా.. దేవిశ్రీ ఈ నెలలో ఆ పిల్ల‌ల నిర్వ‌హ‌ణ‌కు అయ్యే నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను అందించారు.

“వంద‌లాది చిన్నారుల‌కు శ్ర‌ద్ధ‌తో, నిస్వార్ధంగా డ్యాడీస్ హోమ్‌ వారు చేస్తున్న సేవ నా మ‌న‌సును తాకింది. ఈ ఆశ్రమంలోని కొందరు చిన్నారుల బాగోగులను చూసుకోవడం నా బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ఇప్పుడున్న క‌ఠిన ప‌రిస్థితుల్లో ఇలాంటి వారికి అండ‌గా నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం మ‌నుషులుగా మ‌న‌కెంతో ఉంది. ఎవ‌రైనా డ్యాడీస్ హోం వారికి సాయం చేయాల‌నుకుంటే.. 9948661346 నెంబ‌ర్‌కు కాల్ చేసి మీ వంతు సాయాన్ని అందించండి“ అని విజ్ఞప్తి చేశారు దేవిశ్రీ ప్ర‌సాద్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular