Saturday, April 20, 2024
Homeసినిమాశర్వానంద్ సినిమాకు దేవిశ్రీ సంగీతం

శర్వానంద్ సినిమాకు దేవిశ్రీ సంగీతం

శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకం పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. శర్వానంద్, రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణం పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల.

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలోని ఫీమేల్‌ క్యారెక్టర్స్‌ మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుందని తెలుస్తుంది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో నటిస్తున్నారు. జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్న‌ ఈ సినిమాకు సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రాఫర్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్