Thursday, June 18, 2026
HomeసినిమాUstaad Bhagat Singh: మ్యూజిక్ సిట్టింగ్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్'

Ustaad Bhagat Singh: మ్యూజిక్ సిట్టింగ్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న మరో మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకం పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైంది. పది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. మొదటి షెడ్యూల్ కి సంబంధించిన ఎడిటింగ్ పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ఇక తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలవ్వడం విశేషం.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్ కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. సంచలన వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించింది. ‘గబ్బర్ సింగ్’ విజయంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాలోని ప్రతి పాట బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. చిత్రంలోని పాటలు దశాబ్దం తరువాత కూడా నేటికీ మారుమ్రోగుతున్నాయి. అలాంటి మ్యాజిక్ నే మరోసారి రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు ఈ త్రయం.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో “అరేయ్ సాంబ రాస్కోరా” అంటూ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ వినిపించింది. అలాగే వీడియోలో దేవి శ్రీ ప్రసాద్, హరీష్ శంకర్ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. వారి ఉత్సాహం చూస్తుంటే.. ‘గబ్బర్ సింగ్’ని మించిన బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించబోతున్నారని అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు మరియు తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular