Thursday, April 25, 2024
Homeసినిమారవితేజ 'ధమాకా' చూపిన ట్రైలర్

రవితేజ ‘ధమాకా’ చూపిన ట్రైలర్

రవితేజ, త్రినాధ రావు నక్కిన కాంబినేషన్లో  రూపొందిస్తున్న ‘ధమాకా’తో విడుదలకు సిద్ధమవుతోంది. టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే  విడుదలైన టీజర్‌లో సినిమాలోని యాక్షన్‌ యాంగిల్ ఎక్కువగా చూపించారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తూ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.

స్వామి (రవితేజ) నిరుద్యోగి. స్లమ్ లో నివసించే స్వామికి నెలకు కనీసం ఒక ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంతో కూడుకున్న పని. మరో వైపు ఆనంద్ చక్రవర్తి (మరో రవితేజ) ఒక మల్టీ మిలియనీర్. అతను ఒక నెలలో 1000 మందికి ఉపాధిని ఇవ్వగలడు. మరో వైపు పావని (శ్రీలీల) వారిద్దరితో ప్రేమలో ఉంటుంది. స్వామి, ఆనంద్‌లు దారులు వేరు కానీ.. విధి వారిని ఒక కామన్ శత్రువుతో పోరాడటానికి ఒక చోట చేరుస్తుంది.

రవితేజ ఆనంద్‌గా క్లాస్‌గా కనిపించి స్వామిగా మాస్‌గా కనిపించారు. రెండు పాత్రలలోనూ ఒదిగిపోయినప్పటికీ మాస్ క్యారెక్టర్‌ మరింత ఆకర్షణీయంగా వుంది. శ్రీలీల తన ఛార్మ్ నెస్ తో ఆకట్టుకుంది. భీమ్స్ సిసిరోలియో యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా జింతాక్ బీట్స్ ఎక్స్ట్రా కిక్ ని ఇచ్చాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని లావిష్ గా  నిర్మించాయి. ట్రైలర్ అంతటా గ్రాండ్‌నెస్ ఉంది. ప్రసన్న కుమార్ బెజవాడ హిలేరియస్ రైటింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. త్రివిక్రమ్‌ పై ఒక డైలాగ్ హిలేరియస్ గా వుంది. ఇది త్రివిక్రమ్ పై రచయితకు ఉన్న గౌరవాన్ని చూపుతుంది. మొత్తం మీద ట్రైలర్ సినిమా పై క్యూరియాసిటీని పెంచింది.ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించారు.ఈ ట్రైలర్‌ తో అంచనాలు పెంచేసిన ‘ధమాకా’ డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్