Thursday, March 12, 2026
Homeసినిమాఅదే పద్ధతిని ఫాలో అవుతున్న శేఖర్ కమ్ముల!

అదే పద్ధతిని ఫాలో అవుతున్న శేఖర్ కమ్ముల!

టాలీవుడ్ దర్శకులలో శేఖర్ కమ్ముల స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. ఆయన సినిమాల్లో కథానాయిక పాత్రకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఆయన తయారు చేసుకున్న కథల్లో సున్నితమైన భావోద్వేగాలు ఉంటాయి.  ‘ఆనంద్’ నుంచి అదే పద్ధతి కనిపిస్తుంది. ఇక ఆయన స్టార్ హీరోలకి దూరంగానే తన ప్రాజెక్టులను తీసుకుని వెళుతూ ఉంటాడు. అయితే ఈ సారి మాత్రం ఆయన తన రూట్ మార్చుతూ వెళుతున్నాడు.

శేఖర్ కమ్ముల తన మార్క్ సినిమాల నుంచి కాస్త దూరంగా వెళుతున్నాడనడానికి నిదర్శనమే ధనుశ్ మూవీ. అవును ధనుశ్ తో ఒక సినిమా చేయడానికి ఆయన తన వైపు నుంచి అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను సెట్ చేయలేదు. ‘మహాశివరాత్రి’ కానుకగా, రేపు ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. రష్మిక కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, నాగార్జున కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

సాధారణంగా శేఖర్ కమ్ముల ఒక సినిమాకి సంబంధించిన అన్ని పనులను సిద్ధం చేసుకుని వచ్చి, ఆ సినిమా పూజా కార్యక్రమాల నుంచి రిలీజ్ టాక్ వరకూ సందడి చేస్తాడు. ఆ తరువాత ఆయన ఏం చేస్తున్నారనేది ఎవరికీ తెలియదు. అందుకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడం ఆయనకి  అలవాటు లేదు. తన సినిమా మాట్లాడాలి .. తాను కాదు అనే పద్ధతినే ఆయన ఈ సినిమా విషయంలోను ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం ధనుశ్ 50వ సినిమాగా ‘రాయన్’ రూపొందుతోంది. ఈ సినిమా తరువాత, శేఖర్ కమ్ములతో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular