Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్భారత స్పిన్ కు ఇంగ్లాండ్ దాసోహం

భారత స్పిన్ కు ఇంగ్లాండ్ దాసోహం

ఇంగ్లాండ్ తో నేడు మొదలైన ఐదో టెస్టులో తొలి రోజు ఇండియా ఆధిక్యం ప్రదర్శించింది. భారత స్పిన్ కు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ దాసోహం కావడంతో 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కుల్దీప్ యాదవ్ 5; రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లతో సత్తా చాటగా మరో వికెట్ రవీంద్ర జడేజాకు దక్కింది. అశ్విన్ కు ఇది 100వ టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం.

ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మొదలైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి వికెట్ కు 64 (డక్కెట్-27) పరుగులు చేసింది. ఓలీ పోప్ 11 పరుగులకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలే 79 పరుగులు చేసి మూడో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సరైన భాగస్వామ్యం నమోదు చేయడంలో ఆతిథ్య జట్టు విఫలమైంది. 175 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. 57.4 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఇండియా తొలి వికెట్ కు 104 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 57 రన్స్ చేసి ఔటయ్యాడు. రోహిత్ శర్మ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 135 పరుగులు చేసింది. రోహిత్-52; శుభ్ మన్ గిల్-26 పరుగులతో క్రీజులో ఉన్నారు. షోహిబ్ బషీర్ కు జైస్వాల్ వికెట్ దక్కింది.

ఇండియా ప్రస్తుతానికి 83 పరుగులు వెనకబడి ఉంది.

ఐదు మ్యాచ్ ల సిరీస్ ను ప్పటికే 3-1 తేడాతో ఇండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్