Friday, April 19, 2024
Homeసినిమాధనుష్ ద్విభాషా చిత్రం‌ సార్‌ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

ధనుష్ ద్విభాషా చిత్రం‌ సార్‌ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ ‘ధనుష్‘తో వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు) ‌’వాతి’,(తమిళం) షూటింగ్ ముగింపు దశలో ఉంది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) మరియు శ్రీకర స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. ధనుష్ కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది.

ఇటీవల”యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్” స్లోగన్ తో ఈ చిత్రానికి సంబంధించి విడుదల అయిన టైటిల్ రివీల్ వీడియో ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన, ఉత్తేజ‌క‌ర‌మైన‌ క‌థ‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌న ముందు ప్రెజెంట్ చేయ‌నున్నార‌నే న‌మ్మ‌కం కలిగించింది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రం పేరుతో కూడిన విడుదల అయిన ప్రచార చిత్రాలు కూడా ఆ నమ్మకాన్ని మరింత పెంచాయి. దీనిని మరింత ముందుకు తీసుకు వెళుతూ చిత్ర కథానాయకుడు ధనుష్ పుట్టినరోజు జూలై 28 సందర్భాన్ని పురస్కరించుకుని వేడుకలకు ఒక రోజు ముందే తెరతీస్తూ ‘సార్’ తొలి ప్రచార చిత్రాన్ని ఈరోజు విడుదల చేసింది చిత్రం యూనిట్.

ఈ ప్రచార చిత్రంలో ధనుష్ ‘సార్’ ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా, దీక్షగా రాసుకుంటున్నట్లు కనిపిస్తారు. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారు. దేనికి సిద్ధ మవుతున్నారు లాంటి ప్రశ్నలన్నిటికీ ‘సార్’ సమాధానం వెండితెర మీద చూడాల్సిందే. ఈ ప్రచారచిత్రం తో చిత్రం పట్ల పెరిగిన ఆసక్తి మరింత స్థాయికి వెళ్ళే దిశగా ధనుష్ పుట్టినరోజు నాడు సాయంత్రం 6 గంటలకు విడుదల అయ్యే వీడియో చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ధనుష్ అభిమానుల ఆనందం అంబరాన్ని అంటుతుంది.

ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ…’సార్’ చిత్రంలో ధనుష్ లెక్చరర్ గా కనిపిస్తారు. విద్యా వ్యవస్థ నేపధ్యంలో జరిగే కథ. నేడు విడుదల ఆయన ప్రచార చిత్రం కానీ, రేపు మా హీరో ధనుష్ గారు పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న వీడియో చిత్రం కానీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రూపొందుతోంది చిత్రం. దీనికి తగినట్లుగా ధనుష్ గారు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆయన సహకారం, ఆయనతో ప్రయాణం మర్చిపోలేనిది అన్నారు. అలాగే జి వి ప్రకాష్ గారి సంగీతం, యువరాజ్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరింత వన్నె తెస్తాయి అని నమ్ముతున్నాను అని తెలిపారు.

‘సార్’ అక్టోబర్ లో విడుదలకానుంది. తెలుగు, తమిళ భాషల్లో తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని, రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు, విశేషాలు వెల్లడి చేయనున్నట్లు తెలిపారు నిర్మాత నాగవంశీ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్