25.7 C
New York
Thursday, October 5, 2023

Buy now

HomeTrending NewsWomen Bill: కాంగ్రెస్ బిజెపి దొందు దొందే - ఎమ్మెల్సీ కవిత

Women Bill: కాంగ్రెస్ బిజెపి దొందు దొందే – ఎమ్మెల్సీ కవిత

మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేస్తేనే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మహిళల హక్కులపై కాంగ్రెస్ బిజెపి దొందు దొందేనని, ఆ రెండు పార్టీల వైఖరి ఒకటేనని మండిపడ్డారు. 2010 రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ 2014 వరకు అధికారంలో ఉన్న కూడా లోక్సభలో ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. గత పదేళ్ల కాలంలో మహిళా బిల్లుపై ప్రధాని నరేంద్ర మోడీని సోనియాగాంధీ ప్రియాంక గాంధీ ఎందుకు నిలదీయలేదని అడిగారు. ఈ ఏడాది డిసెంబర్లో మరోసారి తాను జంతర్మంతర్లో ధర్నా చేస్తానని, ఆ ధర్నాకు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నీ సైతం ఆహ్వానిస్తానని ప్రకటించారు.

బుధవారం  హైదరాబాదులోని తన నివాసంలో కవిత విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.

మహిళా రిజర్వేషన్ల కోసం, మహిళలకు ఆస్తి హక్కు కోసం అంబేద్కర్ కూడా పోరాటం చేసినప్పుడు అవహేళన చేశారని, రాజీనామా చేసే పరిస్థితులు కల్పించారని, మహిళా హక్కుల గురించి మాట్లాడినప్పుడు ఎంత వ్యతిరేకత ఉంటుందన్నది కొత్త అంశంకాదని అన్నారు. కానీ ఇప్పటికీ పార్టీలు సంకుచితంగా ఆలోచించడం, మరీ ముఖ్యంగా పలు పార్టీలకు చెందిన మహిళా నేతలు మాట్లాడడం దురదృష్టకరమన్నారు.తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన మహిళా నాయకులు తనపై విరుచుకుపడుతున్నారని, దీని వల్ల ఎవరికి లాభమన్నది బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని సూచించారు.

మహిళల హక్కుల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ దొందుదొందేనని మండిపడ్డారు. చట్టం చేస్తేనే ఈ దేశంలో మహిళలకు రక్షణ కలుగుతుందని, అప్పుడే మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుందని, కానీ చట్టం చేసే ఉద్ధేశం ఆ రెండు పార్టీలకు లేదని నిరూపించున్నాయని స్పష్టం చేశారు. డిసెంబరులో జంతర్ మంతర్ వద్ద మరోసారి భారీ ధర్నా నిర్వహిస్తానని, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు బీజేపీ నాయకురాలు డీకే అరుణ నుంచి స్మృతీ ఇరానీ వరకు అందరినీ ఆహ్వానిస్తానని ప్రకటించారు.

ఈవీఎంల ట్యాంపర్ జరుగుతోందని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ నిరూపిస్తే ఆయనను ఆ పోస్టు నుంచి తీసేశారని, దానిపై దేశమంతా చర్చ జరుగుతోందని, అటువంటి సందర్భంలో బీజేపీ ఎంపీ అర్వింద్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనుమానాలను తావిస్తోందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పరిశీలించాలని తాను సీరియస్ గా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. తమ పార్టీ న్యాయ విభాగం తరఫున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాబోదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా తెలుసని, కాబట్టి అమలుకు సాధ్యంకానీ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లోనూ ఇలాంటి తప్పుడు హామీలే ఇచ్చారని చెప్పారు. ఏ రాజకీయ నాయకుడు తీసుకోలేనన్ని రిస్కులు కేసీఆర్ తీసుకున్నారని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట, గజ్వేల్ నుంచి కేసీఆర్ గెలుపొందారని, వ్యూహాత్మకంగానే కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలోకి దిగారన్నారు.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

న్యూస్