Tuesday, March 10, 2026
Homeసినిమాచైతూ ఫస్టు వెబ్ సిరీస్ గా వస్తున్న 'దూత'

చైతూ ఫస్టు వెబ్ సిరీస్ గా వస్తున్న ‘దూత’

టాలీవుడ్ నుంచి చాలామంది హీరోలు ఇప్పటికే వెబ్ సిరీస్ ల దిశగా అడుగులు వేశారు. వెబ్ సిరీస్ లు వివిధ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వెళుతుండటం .. సినిమా రేంజ్ కి తగ్గని విధంగా నిర్మాణ విలువలు ఉండటం .. ఇతర భాషా ప్రేక్షకులకు సైతం ఆర్టిస్టులు దగ్గర కావడం ఇందుకు ప్రధానమైన కారణాలుగా కనిపిస్తున్నాయి. అందువల్లనే సినిమాకి .. సినిమాకి మధ్య వెబ్ సిరీస్ లను ప్లాన్ చేసుకోవడం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది.

అలా నాగచైతన్య కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘దూత‘ అనే వెబ్ సిరీస్ చేశాడు. ‘మనం’  సినిమా నుంచి విక్రమ్ కుమార్ తో చైతూ ట్రావెల్ అవుతున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఈ మధ్యనే ‘థ్యాంక్యూ’ అనే సినిమా కూడా వచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా విక్రమ్ కుమార్ పట్ల గల అభిమానంతో చైతూ ఆయనతో ఈ వెబ్ సిరీస్ చేశాడు. విక్రమ్ కుమార్ కి కూడా ఇదే ఫస్టు వెబ్ సిరీస్ కావడం విశేషం.

‘దూత’ హారర్ థ్రిల్లర్ టచ్ తో సాగే సిరీస్. ఈ సిరీస్ లో చైతూ జర్నలిస్టు పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. విక్రమ్ కుమార్ సినిమాల్లో ఆయన స్క్రీన్ ప్లే ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. ఈ సిరీస్ లోను స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రియా భవాని శంకర్ .. పార్వతి తిరువోతు .. ప్రాచీదేశాయ్ ఈ సిరీస్ లో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ సిరీస్ తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular