Tuesday, June 16, 2026
HomeసినిమాDhootha: నాగచైతన్య 'దూత' ఏమైంది?

Dhootha: నాగచైతన్య ‘దూత’ ఏమైంది?

అక్కినేని నాగచైతన్య ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి దూత అనే వెబ్ సిరీస్ చేశారు. దీనికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇదొక హర్రర్ వెబ్ సిరీస్. నాగచైతన్యకు హర్రర్ మూవీస్ అంటే భయం. ఎప్పుడూ హర్రర్ నేపధ్యంలో సినిమా చేయనని కెరీర్ ప్రారంభంలోనే చెప్చెపారు. కానీ.. హర్రర్ బ్యాక్ డ్రాప్ లో దూత అనే వెబ్ సిరీస్ చేయడం విశేషం. అమెజాన్ ప్రైమ్ కోసం చేసిన ఈ వెబ్ సిరీస్ ‘థ్యాంక్యూ’ సినిమా సమయంలోనే షూటింగ్ పూర్తిచేసుకుంది కానీ, స్ట్రీమింగ్ పై క్లారిటీ లేదు.

ఈ విషయమై నాగచైతన్యను అడిగితే “షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది కానీ స్ట్రీమింగ్ అనేది అమెజాన్ వాళ్లు డిసైడ్ చేస్తారు. ఎప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి..? ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిపై అమెజాన్ కు ఓ ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారమే చేస్తారు తప్ప.. సినిమా చేసినట్టుగా షూటింగ్ అయిపోయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసేయాలనుకోరు” అంటూ చెప్పాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘థ్యాంక్యూ’, ఇటీవలి ‘కస్టడీ’ కూడా ఫరవాలేదనిపించాయి కానీ.. సక్సెస్ కాలేదు. వరుస ప్లాపుల్లో ఉన్న చైతన్య నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఇంకా ప్రకటించలేదు. ఈసారి కథల ఎంపికలో మరింత జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నాడట. చందు మొండేటి, శివ నిర్వాణలతో సినిమాలు ఉంటాయని వార్తలొస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular