Thursday, April 25, 2024
HomeసినిమాSalar-Demand: ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ నెరవేరే ఛాన్స్ ఉందా..?

Salar-Demand: ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ నెరవేరే ఛాన్స్ ఉందా..?

ప్రభాస్ తాజా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ మూవీని ఓంరౌత్ తెరకెక్కించారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పుడు అంతగా సినిమా పై ఆసక్తి లేదు కానీ.. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగాయి. జూన్ 16న ఆదిపురుష్ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే.. ఆదిపురుష్ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ అభిమానులు కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. ముందు రిక్వెస్ట్ గా ఉన్న ఈ ప్రతిపాదన ఆతర్వాత డిమాండ్ గా మారింది.

ఇంతకీ విషయం ఏంటంటే… ఆదిపురుష్ రిలీజ్ సందర్భంగా ప్రచారం మొదలైంది. దీని పై అభిమానుల దృష్టి కాస్త తక్కువుగానే ఉంది. వాళ్ల దృష్టి అంతా సలార్ సినిమా పైనే ఉంది.  అయితే.. ఆదిపురుష్‌ సినిమాతో పాటు సలార్ సినిమా టీజర్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. బాహుబలి హీరో, కేజీఎఫ్ డైరెక్టర్ కాంబోలో వస్తున్న సలార్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కానీ.. మేకర్స్ మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. అందుకనే ఫ్యాన్స్ కొత్తగా ఈ డిమాండ్ ను తీసుకువచ్చారు.

ఆదిపురుష్ సినిమాతో పాటు సలార్ టీజర్ రిలీజ్ చేస్తే.. ఆదిపురుష్‌ చూసిన జనాలకు సలార్ టీజర్ చూసే అవకాశం దక్కుతుంది అనేది వాళ్ల వాదన. నిజానికి ఈ ప్రతిపాదన బాగానే ఉంది. గతంలో బాహుబలి 2 తో పాటు సాహో టీజర్ రిలీజ్ చేశారు. అదే విధంగా ఆదిపురుష్ సినిమాతో పాటు సలార్ టీజర్ రిలీజ్ చేయాలి అంటున్నారు. సలార్ టీమ్ మాత్రం స్పందించలేదు. టీజర్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఆదిపురుష్ రిలీజ్ తర్వాతే సలార్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట. మరి.. ఫ్యాన్స్ డిమాండ్ గురించి మరోసారి ఆలోచిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్