Tuesday, June 16, 2026
HomeసినిమాBichagadu 2: విజయ్ ఆంటోనికి ఇది పరీక్షా సమయమే!

Bichagadu 2: విజయ్ ఆంటోనికి ఇది పరీక్షా సమయమే!

విజయ్ ఆంటోని ఎలాంటి వివాదాలకు దరిదాపుల్లో కనిపించని వ్యక్తి. తన సినిమాల గురించి కూడా చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి. ఆయనకి నటుడిగా .. దర్శక నిర్మాతగా .. ఎడిటర్ గా .. సంగీత దర్శకుడిగా మంచి అనుభవం ఉంది. అయినా ఆయన చాలా ఒదిగిపోయి కనిపిస్తూ ఉంటారు. ‘బిచ్చగాడు’ సినిమా ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పటివరకూ ఆయన గురించి ఇక్కడి ప్రేక్షకులకు అంతగా తెలియదు. ఆ సినిమా తరువాత ఆయనను మరిచిపోలేదు.

‘బిచ్చగాడు’తో విజయ్ ఆంటోనికి ఇక్కడ రికార్డు స్థాయి వసూళ్లు లభించాయి. తమిళంలో కొంతమంది స్టార్ హీరోల కంటే ముందుగా ఆయన ఇక్కడి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు. ఆ సినిమా తరువాత ఆయన హీరోగా చేసిన ప్రతి సినిమాను తెలుగులో విడుదలయ్యేలా చూసుకున్నారు. అయితే అవి ‘బిచ్చగాడు’ను బీట్ చేయలేకపోయాయి. ఆ స్థాయిలో మరో సినిమా ఆడియన్స్ పై అంతగా  ప్రభావం చూపలేకపోయింది. ఆయన కెరియర్ గ్రాఫ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లలేకపోయింది.

ఈ నేపథ్యంలోనే విజయ్ అంటోని ‘బిచ్చగాడు 2’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. ఫస్టు పార్టు సాధించిన ఘన విజయం కారణంగా సెకండ్ పార్టుకి మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. అయితే ఆ తరువాత మాత్రం కంటెంట్ దే బాధ్యత. ఇప్పుడు విజయ్ ఆంటోని క్రేజ్ ను .. మార్కెట్ ను కాపాడవలసిన బాధ్యత కూడా ఈ సినిమాపైనే ఉంది. అందువలన ఈ సినిమా అనేది ఆయనకి ఒక పరీక్షా సమయంలాంటిదే. హీరోగానే కాదు .. దర్శక నిర్మాతగా కూడా ఈ సినిమా ఆయనను ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular