Saturday, July 27, 2024
Homeసినిమా‘డై హార్డ్ ఫ్యాన్’లో బేబమ్మగా షకలక శంకర్

‘డై హార్డ్ ఫ్యాన్’లో బేబమ్మగా షకలక శంకర్

Shakalaka-Rajeev: శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్.M దర్శకత్వంలో ప్రియాంక శర్మ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం డై హార్డ్ ఫ్యాన్. సెలెబ్రిటీ, అభిమాని మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా ఈ సినిమా కథ. ఫ్యాన్ పాత్రలో శివ ఆలపాటి నటిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య సాగే డ్రామా ఇది. ఇందులో షకలక శంకర్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో షకలక శంకర్ బేబమ్మ.. రాజీవ్ కనకాల కృష్ణ కాంత్ పాత్రలో నటిస్తున్నారు.

ఈ ఇద్దరి ఫస్ట్ లుక్ కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమా పూర్తిగా కామెడీ సస్పెన్స్ డ్రామాగా రాబోతుంది. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తేజుద్దీన్ మాటలు రాస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్