Monday, June 8, 2026
HomeTrending Newsకాంగ్రెస్ బలోపేతానికి డిజిటల్ సభ్యత్వ నమోదు

కాంగ్రెస్ బలోపేతానికి డిజిటల్ సభ్యత్వ నమోదు

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికే డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చలిగల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో సభ్యత్వం తీసుకున్నవారికి దురదృష్టవశాత్తు ప్రమాదం సంభవిస్థే 2లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు. పోలింగ్ బూతుకు వంద మంది చొప్పున సభ్యత్వం చేయిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల నియోజకవర్గానికే పార్టీ సభ్యత్వ నమోదులో చలిగల్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లాప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యకర్తలు, నాయకుల అండతోనే నేను 40 ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని, వారికి రుణపడి ఉంటానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య, మాజీ ఎంపీపీ ధర రమేశ్ బాబు, చందా రాధాకిషన్,విజయ్,మహేశ్ తదితరులున్న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular