Friday, April 19, 2024
Homeసినిమాఎఫ్ 3 రిలీజ్ కాకుండానే.. ఎఫ్ 4 ప్లాన్ చేస్తున్నారా?

ఎఫ్ 3 రిలీజ్ కాకుండానే.. ఎఫ్ 4 ప్లాన్ చేస్తున్నారా?

Stay tuned:  విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేష‌న్లో రూపొందిన  ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఎఫ్  2. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించింది. దీంతో ఈ మూవీ సీక్వెల్ గా ఎఫ్ 3 రూపొందిన‌ విష‌యం తెలిసిందే. మే 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మూవీ ట్రైల‌ర్ ను మే 9 న రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ ట్రైలర్ కు డబ్బింగ్ పనుల్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటికే పూర్తి చేయగా.. తాజాగా వెంకీ కూడా డబ్బింగ్ ను పూర్తి చేసాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మేట‌ర్ ఏంటంటే. ఎఫ్ 3 కి సీక్వెల్ గా ఎఫ్ 4 కూడా రాబోతున్నదంట. అనిల్ రావిపూడి ఎఫ్ 3 పై నమ్మకంతోనే ఎఫ్ 4ని కూడా రెడీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏదిఏమైనా ఎఫ్3 రిలీజ్ కాకుండానే ఎఫ్4 గురించి వార్త‌లు రావ‌డం విశేషం. మరి… ప్ర‌చారంలో ఉన్న‌ ఈ వార్త‌ల పై అనిల్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

Also Read మే 27నుంచి నవ్వులు పూయించనున్న‘ఎఫ్ 3’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్