క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టించిన చిత్రం కార్తికేయ 2. ఈ చిత్రానికి చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 13న థియేటర్స్ లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, డైరెక్టర్ శ్రీ వాసు, మైత్రి అధినేత నవీన్ ఏర్నేని తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ… ఈ సినిమాను హిందీలో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్ లలో రిలీజ్ చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయి ఈ రోజు 700 థియేటర్స్ లలో ఆడుతుంది. అంటే ఈ రోజుల్లో సినిమా లాంగ్వేజ్ అనే బారికేడ్లను క్రాస్ అయ్యి ప్రజల గుండెల్లోకి వెళ్ళింది. అంటే సినిమాలో సత్తా లేకపోతే అన్ని థియేటర్స్ లలో ఆడదు కదా.. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాదించాలి అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఇండియా వైజ్ అందరి ప్రేక్షకులకు రిచ్ చేసిన కార్తికేయ 2 సినిమా హోల్ టీం కు కంగ్రాట్స్. ఆగష్టు మంత్ సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నిఖిల్, చందు గార్లు నాతో సినిమా రిలీజ్ గురించి మాట్లాడారు. మాకు ఏ సినిమా అయినా బాగా ఆడితే ముందు మేము ఆనందపడతాం తప్పా మాకు సినీ ఇండస్ట్రీలో  ఎలాంటి విభేదాలు లేకుండా మేమంతా హెల్టీ అట్మాస్ఫియార్ లో ఉంటాం అని అన్నారు.

చిత్ర నిర్మాత తి. జి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. చందు మొండేటి చాలా హార్డ్ వర్క్ చేశాడు. నిఖిల్, అనుపమ మరియు టీం అలాగే టెక్నీకల్ టీం అందరూ బాగా సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది అన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ.. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *