Saturday, June 13, 2026
Homeసినిమా'మసూద' నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించిన దిల్ రాజు

‘మసూద’ నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించిన దిల్ రాజు

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ హారర్ డ్రామా.. విడుదలైన మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టుకుంటోంది.

రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని ఎస్‌విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. చిత్రయూనిట్‌తో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. విశేషం ఏమిటంటే.. ఈ కార్యక్రమానికి ఆయనే యాంకర్‌గా వ్యవహరించి.. సినిమాకు పని చేసిన వారందరితో సినిమా విశేషాలను చెప్పించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ ని కొన్ని ఆసక్తకరమైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు దిల్ రాజు.

50 సినిమాలు తీసిన నిర్మాతగా అడుగుతున్నా… నాకు 2గం. ల 45 నిమిషాల సినిమా చూపించావు. నిడివి తగ్గించమని అడిగితే.. కుదరదని అన్నావు.. అసలు నీ ధైర్యం ఏంటి? అని దిల్ రాజు అడిగగా.. ఏం లేదు సార్.. సినిమా విషయంలో హానెస్ట్‌గా ఉండాలని అనుకున్నాను. కమర్షియల్‌గా చేయడానికి స్క్రిఫ్ట్ పరంగా నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. స్ర్కిప్ట్ విన్నాక.. అందులో సోల్ పోకూడదని అనుకున్నాను. నేను స్ర్కిప్ట్ ఒప్పుకుందే.. హర్రర్ అంశాలతో పాటు.. ఎవరికైనా సహాయం చేయడానికి రీజన్ అవసరం లేదు అనే మెసేజ్ కూడా కారణం. అందుకే కమర్షియల్‌గా కాకుండా.. వైవిధ్యంగా ఉండాలని, నిజాయితీగా వెళ్లాను అని చెప్పారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.

Also Read : ‘అలిపిరికి అల్లంత దూరంలో..’ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular