Thursday, June 18, 2026
HomeసినిమాRajinikanth: రజనీ తో సినిమా చేస్తున్న బాబీ..?

Rajinikanth: రజనీ తో సినిమా చేస్తున్న బాబీ..?

చిరంజీవితో డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో చిరంజీవిని అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చూపించారు. బ్లాక్ బస్టర్ సాధించారు. అయితే.. ఈ సినిమా తర్వాత బాబీ సినిమా ఎవరితో అనేది ఇంత వరకు ప్రకటించలేదు. అలాగే బాబీ తదుపరి చిత్రం గురించి ఎలాంటి వార్తలు కూడా బయటకు రాలేదు. అయితే.. ఉన్నట్టుండి రజనీకాంత్ తో బాబీ సినిమా కన్ ఫర్మ్ అయ్యిందనే టాక్ వచ్చింది. దీంతో రజనీతో బాబీ సినిమానా..? ఇది నిజమేనా..? కాదా..? అనేది ఆసక్తిగా మారింది.

ఇటీవల తమిళ హీరోలు టాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ధనుష్, శివ కార్తికేయ టాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేశారు. అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్ కూడా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో వరిసు.. తెలుగులో వారసుడు అనే టైటిల్ తో సినిమా చేశారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ధనుష్ ‘సార్’ అనే మూవీ చేయగా, అనుదీప్ డైరెక్షన్ లో శివ కార్తీకేయన్ ప్రిన్స్ అనే సినిమా చేశారు. ఇలా తమిళ హీరోలు.. తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు రజనీకాంత్ కూడా తెలుగు డైరెక్టర్ బాబీతో సినిమా చేసేందుకు ఓకే చెప్పడం టాక్ ఆప్ ది ఇండస్ట్రీ అయ్యింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రజనీకాంత్, బాబీ కాంబినేషన్లో మూవీని దిల్ రాజు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. దిల్ రాజు ఇప్పటికే విజయ్ తో ‘వారసుడు’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు రజనీకాంత్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. రజనీ నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో జైలర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాబీతో రజనీ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా రజనీతో బాబీ సినిమా కన్ ఫర్మ్ అయితే.. ఇది బాబీకి బంపర్ ఆఫరే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular