Saturday, January 18, 2025
Homeసినిమారామ్ చరణ్, శంకర్ మూవీకి లైన్ క్లియర్.

రామ్ చరణ్, శంకర్ మూవీకి లైన్ క్లియర్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల పూర్తైన తర్వాత గ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్‌ పాన్ ఇండియా మూవీ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. ఇది రామ్ చరణ్ కి 15వ చిత్రం కాగా దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం.

ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేసే వరకు శంకర్ మరో చిత్రం చేయకుండా అడ్డుకోవాలని లైకా సంస్థ కోర్టుని కోరింది. ఇలా లైకా సంస్థ కోర్టుకెక్కడంతో.. రామ్ చరణ్‌, శంకర్ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి చాలా టైమ్ పడుతుందని వార్తలు వచ్చాయి. దీంతో చరణ్ శంకర్ తో చేసే సినిమా కన్నా ముందుగా మరో సినిమా చేయనున్నారు అంటూ టాక్ వినిపించింది. అయితే.. తాజాగా మద్రాసు హైకోర్టులో శంకర్ కు బిగ్ రిలీఫ్ లభించింది. శంకర్ మరో సినిమా చేయకుండా అడ్డుకోవాలని లైకా సంస్థ వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. అంతే కాకుండా.. అలా అడ్డుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పుతో చరణ్‌, శంకర్ మూవీకి లైన్ క్లియర్ అయినట్టు అయ్యింది. ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ లో స్టార్ట్ కానుందని వార్తలు వస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్