Sunday, January 19, 2025
Homeసినిమాబాల‌య్య‌తో 'దిల్' కుదిరిందా?

బాల‌య్య‌తో ‘దిల్’ కుదిరిందా?

Balayya to do Dil Raju movie: తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి.. ఎన్నో విజ‌యవంత‌మైన చిత్రాల‌ను అందించి.. ఉత్త‌మాభిరుచి గ‌ల నిర్మాత‌గా పేరు సంపాదించుకున్నారు నిర్మాత‌ దిల్ రాజు. తెలుగులోనే కాకుండా త‌మిళ్, హిందీలో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే.. తెలుగులో చిరంజీవి, బాల‌య్య‌ల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా నిర్మించ‌లేదు. చిరంజీవితో ఓ చిత్రం, బాల‌య్య‌తో ఓ సినిమా చేయాల‌నేది దిల్ రాజు డ్రీమ్.
ఈ రెండు డ్రీమ్స్ లో ఒక‌టైన బాల‌య్య‌తో ఇప్పుడు దిల్ రాజు సినిమా చేయ‌బోతున్నార‌ని తెలిసింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి.. బాల‌య్య కోసం ఓ క‌థ రెడీ చేశారు. ఆ క‌థ బాల‌య్య విని ఓకే చెప్ప‌డం కూడా జ‌రిగింది. అయితే.. ఈ మూవీని అనిల్ రావిపూడి వేరే బ్యాన‌ర్ లో చేయాల్సివుంది. దిల్ రాజు బాల‌య్య‌తో సినిమా చేయ‌డం త‌న డ్రీమ్ అని.. ఈ సినిమాను త‌న బ్యాన‌ర్ లో చేయ‌మ‌ని అనిల్ రావిపూడిని ఒప్పించార‌ట‌. అనిల్ రావిపూడి ఓకే అన్నార‌ట‌. ఈ విధంగా బాల‌య్య‌తో సినిమా చేయాల‌నే దిల్ రాజు డ్రీమ్ నెర‌వేర‌బోతుందని టాక్ వినిపిస్తోంది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్