Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్కివీస్ మహిళలదే వన్డే సిరీస్

కివీస్ మహిళలదే వన్డే సిరీస్

Kiwis won ODI series: న్యూజిలాండ్ – ఇండియా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న వన్డే  సిరీస్ ను న్యూజిలాండ్ గెల్చుకుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి 3-0 తో ఆధిక్యంలో నిలిచింది. నేడు జరిగిన మూడో వన్డేలో 3 వికెట్ల తేడాతో కివీస్ విజయం సాధించింది.  అమెరియా కెర్ర్-67; అమీ సత్తెర్ వైత్-59 తో పాటు చివర్లో లారెన్ డౌన్-64 పరుగులతో అజేయంగా నిలవడంతో కివీస్ మహిళా జట్టు ఇండియా విసిరిన 280 పరుగుల లక్ష్యాన్ని 49.1 ఓవర్లలో 7  వికెట్లు కోల్పోయి సాధించింది.  ఓ దశలో  ఇండియా గెలుపుపై ఆశలు రేగినప్పటికీ లారెన్ డౌన్ ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా ఆడి మ్యాచ్ ను తమవైపు తిప్పింది.  ఇండియా బౌలర్లలో గోస్వామి మూడు, రేణుకా సింగ్, ఏక్తా బిస్త్, దీప్తి శర్మ, స్నేహ్ రానా  తలా ఒక వికెట్ సాధించారు.

క్వీన్ స్టోన్స్ లోని జాన్ డేవిస్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు ఇండియా ఓపెనర్లు షెఫాలీ- మేఘన 100 పరుగులు జోడించారు. మేఘన 41 బంతుల్లో 9ఫోర్లు 2 సిక్సర్లతో  61 పరుగులు చేసి  ఔట్ అయ్యింది.  షెఫాలీ కూడా అర్ధ సెంచరీ (51) చేసి పెవిలియన్ చేరింది.  ఆ తర్వాత దీప్తి శర్మ రాణించి 69 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.  కెప్టెన్ మిథాలీ-23; యాస్తిక భాటియా-19 పరుగులు చేశారు. 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఇండియా ఆలౌట్ అయ్యింది. కివీస్ బౌలర్లలో హన్నా రోవె, రోజ్ మేరీ మేర్ చెరో రెండు; సోఫీ డేవిన్, అమేలియా కెర్ర్, మాకే, సత్తెర్ వైత్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

రెండు జట్ల మధ్య జరిగిన ఏకైక 20 మ్యాచ్ లో విజయం సాధించిన కివీస్ వన్డే సిరీస్ ను కూడా తమ ఖాతాలో వేసుకుంది.

జట్టును విజయపథంలో నడిపించిన లారెన్ డౌన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇదే వేదికగా నాలుగో వన్డే ఫిబ్రవరి 22న జరగనుంది.

Also Read : రెండో వన్డేలోనూ కివీస్ మహిళలదే విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్