Tuesday, March 17, 2026
Homeసినిమానెక్ట్స్ భారీగా ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి..?

నెక్ట్స్ భారీగా ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి..?

పటాస్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమై తొలి ప్రయత్నంలోనే కమర్షియల్ సక్సెస్ సాధించారు అనిల్ రావిపూడి. ఆతర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎష్ 3.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించి అందరి దృష్టి తన వైపుకు తిప్పుకున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే.. భగవంత్ కేసరి తర్వాత అనిల్ నెక్ట్స్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు అనిల్ అంటే కామెడీ చిత్రాలు బాగా తీస్తాడనే పేరు వచ్చింది కానీ.. యాక్షన్ మూవీస్ బాగా తీస్తాడనే పేరు రాలేదు. బాలయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సాధిస్తే.. స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు. కాబట్టి ఎన్టీఆర్ కోసం అనిల్ రావిపూడి ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడట. అలాగే చరణ్ కోసం కూడా ఓ స్టోరీ రెడీ చేస్తున్నాడని తెలిసింది. భగవంత్ కేసరి రిలీజ్ తర్వాత ఎన్టీఆర్, చరణ్‌ ఇద్దరికీ కథ చెప్పాలనేది అనిల్ ప్లాన్ అని తెలిసింది.

ఎన్టీఆర్ తో మూవీ చేయాలని పట్టుదలగా ఉన్నాడట. అభిమానులకు నచ్చేలా పవర్ ఫుల్ స్టోరీ లైన్ రెడీ అయ్యిందట. ఒక వేళ ఎన్టీఆర్ దగ్గర సెట్ కాకపోతే చరణ్ కు కథ చెప్పాలనేది సెకండ్ ప్లాన్ అట. ఈ రెండూ సెట్ కాకపోతే ఎఫ్ 3 సీక్వెల్ ఎఫ్ 4 చేయాలి అనుకుంటున్నాడట. ఎఫ్ 4 చేయడానికి వెంకీ, వరుణ్ రెడీగానే ఉన్నారు. అలాగే ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత దిల్ రాజు కూడా రెడీగానే ఉన్నారు. మరి.. అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీ విషయంలో ఏ ప్లాన్ వర్కవుట్ అవుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular