Saturday, January 18, 2025
Homeసినిమాసాయి ధరమ్ టైటిల్ తో షారుఖ్ మూవీ?

సాయి ధరమ్ టైటిల్ తో షారుఖ్ మూవీ?

Bollywood Jawan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రానుంద‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. అఫిషియ‌ల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. అయితే.. కోలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా అట్లీ కుమార్ కి మంచి పేరు ఉంది. విజయ్ హీరోగా అట్లీ తెర‌కెక్కించిన‌ తెరి, మెర్సెల్, బిగిల్ సినిమాలు అక్కడ భారీ విజయాలను సాధించాయి. ఆ చిత్రాలు తెలుగులోకి డ‌బ్ అయ్యాయి. ఈ సినిమాలు ఇక్కడ కూడా మంచి వసూళ్లనే రాబట్టాయి.

అయితే… తన ఫేవరేట్ హీరో షారుక్ తో సినిమా చేయాలని అట్లీ ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ మధ్య వరుస ఫ్లాపులతో షారుక్ సతమతమయ్యాడు. అందువలన ఆయన తన సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ మధ్యలో ఆయన అంగీకరించినవి రెండే సినిమాలు. ఒకటి పఠాన్ అయితే మరొకటి డంకి. పఠాన్ చిత్రీకరణ చివ‌రి దశలో ఉండగా, డంకి ఇటీవలే మొదలైంది.

ఈ నేపథ్యంలోనే షారుక్ తో చేయాలనుకున్న కథ పై కసరత్తు చేస్తూ వచ్చిన అట్లీ కుమార్, మొత్తానికి ఆయనను ఒప్పించినట్టు సమాచారం. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే… ఈ సినిమాకి ‘జవాన్’ అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయిగా నయనతార పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందట. జ‌వాన్ అనేది మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన సినిమా టైటిల్. ఇప్పుడు షారుఖ్ మూవీకి ఆ టైటిల్ పెట్ట‌డం విశేషం. మ‌రి.. స‌రైన స‌క్సెస్ కోసం ఎదురు చూస్తోన్న షారుఖ్ కి జ‌వాన్ విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్