Saturday, January 18, 2025
Homeసినిమా`జ‌గ‌దానంద కార‌క` ప్రారంభం  

`జ‌గ‌దానంద కార‌క` ప్రారంభం  

నూత‌న న‌టీన‌టుల‌ను తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ చ‌క్రాస్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న చిత్రం `జ‌గ‌దానంద కార‌క‌’. రామ్ భీమ‌న ద‌ర్శ‌కుడు. నిర్మాత వెంక‌ట‌ర‌త్నం.  లైన్ ప్రొడ్యూసర్స్ గా  మాదాసు వెంగ‌ళ‌రావు, స‌తీష్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వినీత్ చంద్ర‌ – అనిషిండే హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్నారు. గురువారం ఉదయం  ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ప్రముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌ ద‌ర్శ‌క‌సంఘం మాజీ అధ్య‌క్షుడు వీర‌శంక‌ర్ స్క్రిప్టు ప్ర‌తులు అందించగా.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబి క్లాప్  కొట్టారు. ఇతర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌ర‌గ‌నుంది. జూలై 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ చిత్రీక‌ర‌ణ సాగ‌నుంది. క‌డియం-రాజ‌మండ్రి ప‌రిస‌రాల‌లో తెర‌కెక్క‌నుంది.

దర్శ‌కుడు బాబి మాట్లాడుతూ-“టైటిల్ చాలా పాజిటివ్ గా ఉంది. ద‌ర్శ‌కుడు భీమ‌న‌ పెద్ద సక్సెస్ ఇవ్వాలి. ఈ సినిమా టైటిల్ లోగో నాకు బాగా నచ్చింది. నా సినిమా `జై ల‌వ‌కుశ` త‌ర‌హా పాజిటివిటీ క‌నిపించింది. అంత పెద్ద విజ‌యం అందుకోవాలి“ అని అన్నారు.

దర్శకులు  వీర‌శంక‌ర్ మాట్లాడుతూ- “నా ప్రియ‌మిత్రుడు రామ్ భీమ‌న మూడో సినిమా ఇది. ఈ సినిమాకి మంచి టైటిల్ పెట్టారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు మంచి పేరు రావాలి. చ‌క్క‌ని విజ‌యం అందుకోవాలి“ అన్నారు. ద‌ర్శ‌కుడు రామ్ భీమ‌న‌ మాట్లాడుతూ- దర్శకుడిగా ఇది నా మూడో సినిమా. మీ అంద‌రినీ మెప్పించే గొప్ప సినిమా అవుతుంద‌ని ఆశిస్తున్నా. అంద‌రి ఆశీస్సులు కావాలి“ అన్నారు. ‘ఆక‌తాయి’ సినిమా త‌ర్వాత అదే ద‌ర్శ‌కుడితో మ‌ళ్లీ సినిమా చేస్తున్నామ‌ని లైన్ ప్రొడ్యూసర్ స‌తీష్ కుమార్ అన్నారు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్ర‌మ‌వుతుంది.. అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్