Saturday, January 18, 2025
Homeసినిమా'ప్రేమలు' సీక్వెల్ కి యూత్ రెడీ కావలసిందే!

‘ప్రేమలు’ సీక్వెల్ కి యూత్ రెడీ కావలసిందే!

ప్రేమలు .. ఈ మధ్య కాలంలో యూత్ ను ఒక ఊపు ఊపేసిన సినిమా. వసూళ్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర కూడా అంత సందడి చేసింది. తమిళంలోను .. తెలుగులోను ఈ సినిమా విజయాన్ని సాధించింది. మలయాళంలో ఈ సినిమా హిట్ అనే విషయం మాత్రమే అందరిలోకి వెళ్లింది. ఇక మిగతా భాషల్లో పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ ఉంటే బాగుండునని అంతా అనుకున్నారు. ఆ ముచ్చట వచ్చే ఏడాది తీరనున్నట్టుగా తెలుస్తోంది.

‘ప్రేమలు’ టీనేజ్ లవ్ స్టోరీ. ఈ తరం అమ్మాయిలు .. అబ్బాయిల ఆలోచనా విధానం ఎలా ఉంది? వాళ్ల నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి? అనేది సహజత్వానికి చాలా దగ్గరగా వెళుతూ చెప్పిన ప్రేమకథ ఇది. చాలా కాలం తరువాత వచ్చిన టీనేజ్ లవ్ స్టోరీ కావడంతో యూత్ ఓన్ చేసుకున్నారు. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథపై కసరత్తు జరుగుతున్నట్టుగా సమాచారం. అదే టీమ్ సీక్వెల్ కి పనిచేయనుందని అంటున్నారు.

‘ప్రేమలు’ సినిమాలో హీరోయిన్ కి ఎలాంటి భర్త కావాలనుకుంటున్నది హీరోకి తెలుస్తుంది. ఆమె కలను నిజం చేయడం కోసమే అతను విదేశాలకి వెళతాడు. అతను ఫారిన్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏం జరుగుతుంది? అనేది మిగతా కథ. ఈ సారి ఈ సినిమాను మలయాళంతో పాటు తమిళ .. తెలుగు భాషల్లోను ఒకే సమయంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి సీక్వెల్ ఏ స్థాయిలో వర్కౌట్ అవుతుందో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్