Sunday, May 19, 2024
HomeTrending Newsన్యాయం వైపా? నేరం వైపా?: షర్మిల

న్యాయం వైపా? నేరం వైపా?: షర్మిల

వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ ఎందుకు వద్దన్నారో జగన్ సమాధానం చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.  కడప లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఆమె నేడు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు ఆమె ఇడుపులపాయలోని  డా. వైఎస్సార్ సమాధికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రార్థనల అనంతరం నామినేషన్ పత్రాలను ఆయన సమాధిపై ఉంచారు. ఆ తర్వాత ర్యాలీగా కడప కలెక్టరేట్ కు చేరుకొని వాటిని సమర్పించారు. ఆమె వెంట మాజీ ఎంపి డా. ఎన్ తులసిరెడ్డి, వైఎస్ వివేకా కుమార్తె డా. సునీత జిల్లా పార్టీ నేతలు ఉన్నారు.

ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు దానిపై యూ టర్న్ తీసుకున్నారని నిలదీశారు. ఈకేసుతో సంబంధం ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారని ఆరోపించారు. న్యాయం కోసం సునీత ఐదేళ్లుగా పోరాడుతున్నారని… న్యాయం వైపు ఉంటారో, నేరం వైపు ఉంటారో తేల్చుకోవాలని ప్రజలను కోరారు.  తాను అసలు వైఎస్సార్ బిడ్డనే కాదంటూ ప్రచారం చేసి తల్లి విజయమ్మను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికా పర్యటనలో ఉన్న వైఎస్ విజయమ్మ… షర్మిల కొడుకు, కోడలు; కూతురుతో కలిసి షర్మిలకు ఆల్ ద బెస్ట్ చెబుతూ ఓ ఫొటో ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్