Sunday, May 26, 2024
HomeTrending Newsగూడూరును నెల్లూరులో కలుపుతాం: బాబు హామీ

గూడూరును నెల్లూరులో కలుపుతాం: బాబు హామీ

గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని తెలుగుదేశం అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. బాలాజీ తిరుపతి జిల్లా అలాగే ఉంటుందని కానీ ఆ జిల్లా పరిధిలో ఉన్న గూడూరులో చేరుస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరులో మహిళాసంఘాలతో బాబు ముఖాముఖి నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. నేడు తన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి నేతలకు తినిపించారు.

మహిళల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మహిళలకు ఆస్తి హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లు లాంటి ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టింది టిడిపియేనని పేర్కొన్నారు. దీపం పథకం పెట్టి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. డ్వాక్రా సంఘాలు మొదలుపెట్టింది తమ ప్రభుత్వ హయంలోనే అని గుర్తు చేశారు. మహిళలకు మరింత మేలు చేసేందుకే మహిళా శక్తి పేరుతో నాలుగు ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

జగన్ ఇచ్చేదానికంటే దోచుకునేదే ఎక్కువగా ఉందని బాబు ఎద్దేవా చేశారు. బటన్ నొక్కడంతో పాటు బొక్కడం కూడా చేశారని విమర్శించారు. ఈ ప్రాంతంలో సిలికా, స్వర్ణ ముఖిలో ఇసుకను దోచుకున్నారని ఆరోపించారు. జగన్ అగ్గిపెట్టె లాంటి ఇళ్ళు ఇచ్చారని… ఆయన కట్టింది ఇళ్ళు కాదని పిచ్చుక గూళ్ళు అంటూ వ్యాఖ్యానించారు. ఒక సెంటు భూమితో ఇళ్ళు ఇచ్చారని… ఇప్పుడు ఇళ్ళ స్థానాలు పొందిన వారికి అక్కడే రెండు సెంట్లు స్థలం ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని, ఐదేళ్ళలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళ పట్టాలు ఇస్తామని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్