Friday, March 14, 2025
HomeసినిమాHarish Shankar: 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత హరీష్ శంకర్ చేసే సినిమా ఎవరితో..?

Harish Shankar: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత హరీష్ శంకర్ చేసే సినిమా ఎవరితో..?

గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న హరీష్ శంకర్. పవన్ తో హరీష్ మళ్లీ సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటే.. ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. ఇప్పుడు పవన్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది.

అయితే.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తర్వాత హరీష్ శంకర్ బాలయ్యతో సినిమా చేయనున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. హరీష్ శంకరే స్వయంగా బాలయ్య కోసం స్టోరీ రెడీ చేస్తున్నానని.. ఆయనతో సినిమా చేయాలని ఉందని ఓ వేదిక పై చెప్పడం జరిగింది. అప్పటి నుంచి బాలయ్యతో హరీష్ శంకర్ మూవీ అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు హరీష్ శంకర్ నెక్ట్స్ మూవీ గురించి మరో వార్త బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. రవితేజ కోసం హరీష్ శంకర్ ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశారట.

ఈ చిత్రాన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందట. ఈ కథను ఆల్రెడీ రవితేజకు చెప్పడం.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. దీంతో  హరీష్ శంకర్ నెక్ట్స్ మూవీ ఎవరితో  బాలయ్యతోనా..?  రవితేజతోనా..? అనేది ఆసక్తిగా మారింది. రవితేజ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత రవితేజతో సినిమా అంటే.. మరింత క్రేజ్ రావడం ఖాయం. అయితే.. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ రవితేజతో మూవీ చేస్తాడో..?  బాలయ్యతో చేస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్