Friday, October 18, 2024
Homeసినిమాక్రిష్ విడుదల చేసిన `పీన‌ట్ డైమండ్` ట్రైలర్

క్రిష్ విడుదల చేసిన `పీన‌ట్ డైమండ్` ట్రైలర్

అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.1 గా అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న సినిమా `పీన‌ట్ డైమండ్`. వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమా కి `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా ఆ పాటకు విశేష స్పందన లభించింది.

ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేశారు. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి జె. ప్ర‌భాక‌ర రెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. `పీన‌ట్ డైమండ్` టైటిల్ ఎంతో ఆసక్తిగా ఉంది.  రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. దర్శకుడు ఎంత శ్రద్ధ పెట్టి సినిమా చేశారో అర్థం అవుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి హిట్ అయ్యి దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్