Friday, April 19, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ప్రైవేటు వైద్యులకూ ప్రభుత్వ భరోసా!

ప్రైవేటు వైద్యులకూ ప్రభుత్వ భరోసా!

కోవిడ్ సేవలందిస్తున్నసమయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, నర్సులు, సిబ్బంది కుటుంబాలకు కూడా ఆర్ధిక సహాయంపై పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్ విధుల్లో మృతి చెందిన వైద్యులు, వైద్య సిబ్బంది కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా నిర్ణయించింది ఏపి ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా జూనియర్ డాక్టర్ల చేస్తున్న డిమాండ్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెరవేర్చారు.

మృతి చెందిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు, స్టాఫ్ నర్సుకి రూ.20 లక్షలు, FNO లేదా MNOకి రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నారు. ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది.

కోవిడ్ ‌కారణంగా మరణించిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని ఆదుకోవడంపై సిఎం గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నేడు జీవో విడుదల చేశారు. సోమవారం కోవిడ్ నియంత్రణపై నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. త్వరగా ఆర్థిక సహాయం అందేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్