Tuesday, June 16, 2026
Homeసినిమాకళ్యాణ్ రామ్.. డైరెక్టర్ లేకుండానే సినిమా చేస్తున్నాడా..?

కళ్యాణ్ రామ్.. డైరెక్టర్ లేకుండానే సినిమా చేస్తున్నాడా..?

కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’. ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. స్వాంత్రానికి పూర్వపు కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ నుంచి ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. ఒక భారీ సినిమాను చూడబోతున్న ఫీలింగ్ ఇచ్చింది టీజర్. ఇందులో అన్నీ ఆసక్తికరంగా అనిపించాయి. అలాగే ది బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమాలా ఇది కనిపిస్తోంది.

అయితే… ఈ టీజర్ బాగానే ఉంది కానీ.. చివర్లో ‘A Film by Abishek pictures’ అని వేయడమే ఆశ్చర్యపరిచింది. టీజర్లో కానీ.. పోస్టర్లలో కానీ.. దర్శకుడి పేరేమీ లేదు. నిజానికి ఈ సినిమాను ప్రకటించినపుడు దర్శకుడిగా నవీన్ మేడారం పేరు వేశారు. అతను ఇంతకు ముందు అవసరాల శ్రీనివాస్ హీరోగా హిందీ మూవీ హంటర్ ను రీమేక్ చేస్తూ బాబు బాగా బిజీ సినిమా తీశాడు. హాలీవుడ్లో హ్యారీ పోటర్ సహాలు పలు చిత్రాలకు నవీన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పని చేయడం విశేషం. డెవిల్ లాంటి భారీ ప్రాజెక్టును ఇతని చేతిలో పెట్టినపుడు ఇతను ఈ చిత్రాన్ని డీల్ చేయగలడా అని చాలా మంది ఆశ్చర్యపోయారు.

ఇప్పుడు టీజర్లో మాత్రం డైరెక్టర్ క్రెడిట్స్‌లో నవీన్ పేరు తీసి అభిషేక్ పిక్చర్స్ అంటూ నిర్మాణ సంస్థ టీం పేరు వేశారు. కింద మిగతా టెక్నీషియన్లతో కలిపి నవీన్ పేరూ ఉంది. దీంతో ఏదో జరిగింది. అయితే.. ఏం జరిగింది..? ఎందుకు ఇలా చేసారు..? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. నవీన్ ఇప్పటికీ ప్రాజెక్టులో భాగమైనట్లే కనిపిస్తోంది. మరి ఈ పెద్ద ప్రాజెక్టును అతనొక్కడే హ్యాండిల్ చేయలేడని డైరెక్షన్ బాధ్యతలను ఒక టీంకు అప్పగించారేమో అనిపిస్తుంది. ఈ టీజర్ వచ్చినప్పటి నుంచి డైరెక్టర్ లేకుండానే డెవిల్ సినిమా చేస్తున్నారా అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మరి.. దీని గురించి కళ్యాణ్ రామ్ ఏం చెబుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular