Wednesday, June 17, 2026
HomeTrending Newsచిరు, బాలయ్య మూవీకి డైరెక్టర్ ఎవరో తెలుసా..?

చిరు, బాలయ్య మూవీకి డైరెక్టర్ ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణ ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర నువ్వా..? నేనా..? అన్నట్టుగా పోటీపడ్డారు. ఇప్పటికీ పోటీపడుతూనే ఉన్నారు. ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో వస్తుంటే… బాలకృష్ణ వీరసింహారెడ్డి అనే సినిమాతో వస్తున్నారు. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తుండడం.. ఈ రెండు చిత్రాల్లో కథానాయిక శృతిహాసనే కావడం విశేషం. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకు ఆకట్టుకుంటాయి..? ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే… ఆహా కోసం బాలయ్య అన్ స్టాపబుల్ అంటూ టాక్ షో చేస్తున్నారు. ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ సీజన్ నడుస్తుంది. రీసెంట్ గా ఈ అన్ స్టాపబుల్ టాక్ షోకు ప్రముఖ నిర్మాతలు సురేష్‌ బాబు, అల్లు అరవింద్, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, ఏ.కోదండరామిరెడ్డి వచ్చారు. గీతా ఆర్ట్స్ లో తనతో సినిమా చేయమని బాలయ్య అడిగితే, చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరితోను కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమాను నిర్మించాలనే ఆలోచనలో తాను ఉన్నట్టుగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చెప్పారు.

ఆ తరువాత కొంతసేపటికి వేదిక పైకి వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, బాలయ్య – చిరంజీవి కాంబినేషన్లో అల్లు అరవింద్ చేయాలనుకున్న సినిమాకి దర్శకుడిగా తనకే ఛాన్స్ ఇవ్వాలని అన్నారు. ఈ విషయంలో బాలయ్య తనకి ప్రామిస్ చేయడమే కాకుండా, అల్లు అరవింద్ తో కూడా ప్రామిస్ చేయించాలని అన్నారు. అందుకు బాలయ్యతో పాటు అల్లు అరవింద్ కూడా నవ్వేశారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి నిజంగా చిరు, బాలయ్య కాంబో సెట్ అవుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రేజీ కాంబోలో మూవీ వస్తే.. సంచలనమే. అంతే కాకుండా సినీ అభిమానులందరికీ పండగ లాంటి సినిమా అవుతుంది. మరి.. ఫ్యూచర్ లో ఈ కాంబో మూవీ వస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular