Tuesday, June 16, 2026
HomeసినిమాCharan, Rajkumar: చరణ్‌ తో రాజ్ కుమార్ హిరానీకి సెట్ అయ్యేనా..?

Charan, Rajkumar: చరణ్‌ తో రాజ్ కుమార్ హిరానీకి సెట్ అయ్యేనా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నారు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటునే ఉంది కానీ.. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో క్లారిటీ లేదు. ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేయాల్సివుంది. త్వరలోనే ఈ పాన్ ఇండియా మూవీని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. గేమ్ ఛేంజర్ మూవీ ఆలస్యం అవ్వడం వలన చరణ్ ప్లానింగ్ మార్చుకోవాల్సి వచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత బాగా గ్యాప్ వచ్చింది.

ఇక నుంచి ఇలాంటి గ్యాప్ రాకుండా వరుసగా సినిమాలు చేసేందుకు ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే చరణ్.. రాజ్ కుమార్ హిరానీతో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. ఇటీవల ముంబాయి వెళ్లిన చరణ్. రాజ్ కుమార్ హిరానీని కలిసి కథ గురించి చర్చించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ షారుఖ్ ఖాన్ తో ‘డంకీ’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజ్ కుమార్ హిరానీ సినిమా ఎవరితో అంటూ చరణ్ తో అని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

అయితే.. రాజ్ కుమార్ హిరానీ సినిమాల్లో భారీ ఎలివేషన్స్, బిల్డప్ లు ఉండవు.. సహజంగా ఉంటుంది. ఇప్పుడు చరణ్‌ కు మాస్ మాంచి ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ అయ్యాడు. అందుచేత చరణ్‌ క్రేజ్ తగ్గట్టుగా కథ ఉంటుందా..? ఇద్దరికీ సెట్ అవుతుందా..? అనే డౌట్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే బాలీవుడ్ లో చరణ్ కు మరింతగా క్రేజ్ రావడం ఖాయం. మరి.. ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందో..? లేక పుకారుగానే మిగిలిపోతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular