Saturday, January 18, 2025
Homeసినిమా'రాక్షసుడు 2' హీరో ఎవరు?

‘రాక్షసుడు 2’ హీరో ఎవరు?

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాక్షసుడు’. తమిళంలో విజయం సాధించిన ‘రాక్షసన్’కు ఇది రీమేక్. తెలుగులో కూడా ఈ సినిమా సక్సస్ అయ్యింది. దీనితో రమేష్‌ వర్మ.. రవితేజతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్ లో ‘ఖిలాడి’ రూపొందిన త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఈ రోజు ‘రాక్షసుడు 2’ ని ప్రకటించినా హీరో ఎవరనేది మాత్రం అనౌన్స్ చేయలేదు.

తమిళ్ లో రాక్షసన్ మూవీకి సీక్వెల్ రాలేదు. తెలుగులో మాత్రం ‘రాక్షసుడు 2’ స్టోరీ రెడీ అయ్యింది. ఈ స్టోరీని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కోసమే రెడీ చేశారట. అయితే.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ బాలీవుడ్ రీమేక్ లో నటిస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వినాయక్ దర్వకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా తర్వాత పెన్ స్టూడియోస్ బ్యానర్ లో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పారని సమాచారం. అందుకనే రమేష్ వర్మ ‘రాక్షసుడు 2’ ను మరో హీరోతో చేయాలనుకుంటున్నారని తెలిసింది. మరి.. ఆ హీరో ఎవరో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్