Saturday, January 18, 2025
Homeసినిమాచ‌ర‌ణ్ మూవీపై క్లారిటీ ఇచ్చిన శంక‌ర్

చ‌ర‌ణ్ మూవీపై క్లారిటీ ఇచ్చిన శంక‌ర్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఫ‌స్ట్ టైమ్ శంక‌ర్ డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నారు.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతూ వచ్చింది.  శంక‌ర్ ఇండియ‌న్ 2 షూటింగ్ మ‌ళ్లీ స్టార్ట్ చేయ‌డంతో  ఈ మూవీ ఆగిపోయిందని,  చ‌ర‌ణ్ కూడా గౌత‌మ్ తిన్న‌నూరితో సినిమా చేయ‌బోతున్నారని ప్రచారం మొదలైంది.

దీనిపై శంక‌ర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను కమల్ హాసన్ గారి ఇండియన్ 2 మూవీతో పాటు రామ్ చరణ్ తో చేస్తున్న RC 15 మూవీ కూడా చేస్తున్నాను. ఈ రెండు సినిమాల షూటింగ్ ను ఒకేసారి చేస్తున్నాను అని తెలిపారు.

చ‌ర‌ణ్ తో చేస్తున్న మూవీ నెక్ట్స్ షెడ్యూల్ ను హైద‌రాబాద్, వైజాగ్ లో సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయ‌నున్న‌ట్టు  కూడా తన ప్రకటనలో స్పష్టం చేశారు. దేనితో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నారు. సో… ఈ లెక్క‌న చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ అనుకున్న‌ట్టుగానే స‌మ్మ‌ర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Also Read : చ‌ర‌ణ్ తో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్న శంక‌ర్?

RELATED ARTICLES

Most Popular

న్యూస్