Thursday, March 12, 2026
Homeసినిమారామ్ చరణ్‌ - శంకర్ మూవీ ప్రారంభం

రామ్ చరణ్‌ – శంకర్ మూవీ ప్రారంభం

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ చిత్రంలో చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది. ఈ భారీ చిత్రం ఓపెనింగ్ కి మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌లో భాగంగా రామ్‌చరణ్‌, కైరా అద్వానీల పై మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌ కొట్టారు. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా.. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా.. రూపొందే ఈ చిత్రంలో చరణ్‌ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంజలి, జయం రవి, శ్రీకాంత్‌, సునీల్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ రెండు పాటలను రికార్డ్ చేసినట్టు సమాచారం. ఇది రామ్ చరణ్ కు 15వ చిత్రం కాగా, దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకం పై దిల్‌ రాజు, శిరీష్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2023 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular