Thursday, March 28, 2024
HomeTrending Newsజిందా తిలిస్మాత్...రైతుబంధు - జీవన్ రెడ్డి

జిందా తిలిస్మాత్…రైతుబంధు – జీవన్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాయిల్డ్ రైస్ ( ఉంపుడు బియ్యం )పై ఆంక్షలు విధించడం సరికాదని, దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి రైతుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. వరి ధాన్యంపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బుధవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పొందుపర్చకపోవడంతో రైతాంగం ఆందోళన చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహకం ఇచ్చి ఆదుకోవాల్సిందిపోయి కేంద్రానికి వంతపాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలపై శాసన సభలో తీర్మానం చేయడానికి కాంగ్రెస్ ఒత్తిడి తెస్తే అభిప్రాయం చెప్పడానికి భయపడ్డ ముఖ్యమంత్రి తెలంగాణ హక్కులను ఎలా పరిరక్షిస్తారని కేసీఆర్ తీరును దుయ్యబట్టారు.
సాధారణ వరి మాత్రమే సేకరిస్తామని ఫైన్ రకం వరిపై ఆంక్షలు విధించడం సబబు కాదన్నారు.
ఉపుడు బియ్యం వాడుక ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని దీనిపై ఆంక్షలు విధించడంతో రబిలో సాధారణ వరి పండిస్తారని రైతుల్లో ఆందోళన మొదలయిందని, ఈ రకమైన వరి ధాన్యానికి ఆంక్షలు విధించకుండా మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
పంటల మార్పిడిని ప్రభుత్వం ప్రోత్సహించాలని పప్పు దినుసులు, నూనె గింజల పంటలకు 10 వేలు , వరికి 3 వేలు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పంటలకు 200 నుంచి 500 వందల వరకు ప్రోత్సహకం ఇచ్చి రైతులకు భరోసా కల్పించిందని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. ఎఫ్సీఐ నీ వాణిజ్యసంస్థగా పరిగణించడం దురదృష్టకరమన్నారు.
నేడది టీఆర్ఎస్ పాలనలో కరువైందన్నారు. ప్రభుత్వం రైతుల పంటలకు వెయ్యి రూపాయల ప్రోత్సహకం అందించాలని డిమాండ్ చేశారు.
రైతులకు పంటల భీమా లేదు, ధీర్ఘ కాలిక, స్వల్ప కాలిక రుణాలపై వడ్డీ రాయితీ ఏడేళ్లుగా కల్పించకపోవడంతో ఆబారాన్ని రైతులే భరిస్తున్నారని,రుణమాఫీ కాస్త వడ్డీ మాఫీగా మారిందన్నారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం రైతులకు ఏడేళ్లుగా అందడంలేదని, రైతుబంధు పథకం అన్నిరోగాలకు మందుగా వాడే జిందాతిలిస్మాత్ గా మారిందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
రుణమాఫీ 50 వేల వరకు వాయిదాల ప్రకారం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటికి 30 వేల వరకే చేశాడని వెంటనే రుణమాఫీ చేయాలని జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతుల పక్షాన కోరారు.
జగిత్యాల జిల్లాలో మూతపడ్డ చక్కర ఫ్యాక్టరిని పునః ప్రారంభించాలని దాంతో వరి పండించే రైతుల్లో 50 శాతం మంది పంట మార్పిడి చేసి చక్కెర పంటవైపు మొగ్గుచూపుతారని, ప్రయివేటు వ్యక్తుల సంగతి తేల్చి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతువ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ప్రోత్సహించడం బడా పారిశ్రమిక వేత్తలకు అండగా నిలువడమేనని, అలాగే దేశ సంపదను ప్రయివేటు పారిశ్రమికవేత్తలకు దొచిపెట్టడానికి కుట్రచేస్తుందని కేంద్రం తీరుపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్ళెపెల్లి దుర్గయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, కాంగ్రెస్ నాయకులు దేవేందర్ రెడ్డి, బండ శంకర్,గుండా మధు, జున్ను రాజేందర్, మున్నా, రియాజ్, మహిపాల్ తదితరులున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్