Sunday, January 19, 2025
Homeసినిమాసుకుమార్ నిర్మించిన పాఠశాల భవనం’ ప్రారంభం

సుకుమార్ నిర్మించిన పాఠశాల భవనం’ ప్రారంభం

ముఖ దర్శకులు సుకుమార్.. తన సొంత గ్రామమైన తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు దగ్గరలో గల మట్టపర్రులో తన తండ్రి కీ.శే. శ్రీ బండ్రెడ్డి తిరుపతినాయుడు పేరు మీద పాఠశాల భవనం నిర్మించారు. ఈ భవనం ఆగస్ట్ 1 రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్‌తో పాటు, ఆయన సతీమణి తబిత, ప్రముఖ రాజకీయ నాయకులు, సుకుమార్ సన్నిహితులు-స్నేహితులు పాల్గొన్నారు. కాగా, కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కొరత లేకుండా గ్రామంలో రూ. 40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించారు సుకుమార్. ఇప్పుడు ఈ పాఠశాల భవనం నిర్మించడంతో గ్రామ ప్రజలంతా సుకుమార్, ఆయన ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్