ముఖ దర్శకులు సుకుమార్.. తన సొంత గ్రామమైన తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు దగ్గరలో గల మట్టపర్రులో తన తండ్రి కీ.శే. శ్రీ బండ్రెడ్డి తిరుపతినాయుడు పేరు మీద పాఠశాల భవనం నిర్మించారు. ఈ భవనం ఆగస్ట్ 1 రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్‌తో పాటు, ఆయన సతీమణి తబిత, ప్రముఖ రాజకీయ నాయకులు, సుకుమార్ సన్నిహితులు-స్నేహితులు పాల్గొన్నారు. కాగా, కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కొరత లేకుండా గ్రామంలో రూ. 40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించారు సుకుమార్. ఇప్పుడు ఈ పాఠశాల భవనం నిర్మించడంతో గ్రామ ప్రజలంతా సుకుమార్, ఆయన ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగు, జర్నలిజం, పాలిటిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లు. ప్రింట్, టీవీ మీడియాల్లో 17 ఏళ్లు పాటు సినిమా జర్నలిస్టుగా అనుభవం. వివిధ సినీ వార పత్రికలు, దిన పత్రిక, ఎలెక్ట్రానిక్ మీడియాలో, వెబ్ సైట్ లో వర్క్ చేసిన అనుభవం.