Saturday, January 18, 2025
Homeసినిమాఏజెంట్ కు మెరుగులు దిద్దుతున్న సురేందర్ రెడ్డి

ఏజెంట్ కు మెరుగులు దిద్దుతున్న సురేందర్ రెడ్డి

అక్కినేని అఖిల్ – స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ ఏజెంట్. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర – సురేంద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. త్వరలో సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటే.. కరోనా వలన షూటింగ్ కి బ్రేక్ పడింది. అఖిల్ ని సరికొత్తగా చూపించి అభిమానులు ఆశించినట్టుగా బ్లాక్ బస్టర్ ఇస్తానని డైరెక్టర్ సురేందర్ రెడ్డి చెప్పారు. దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు మరింత బాధ్యతగా ఈ సినిమా స్టోరీ పై వర్క్ చేస్తున్నారు.

ప్రస్తుతం లాక్ డౌన్ కావడం వలన షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ లేదు. అయితే… ఈ లాక్ డౌన్ టైమ్ ను స్ర్కిప్ట్ ను తుది మెరుగులు దిద్దేందుకు ఉపయోగించుకుంటున్నారని తెలిసింది. కొంత మంది రైటర్స్ తో కూర్చొని కథ పై మళ్లీ కసరత్తు చేస్తున్నారట సురేందర్ రెడ్డి. ఇంకా ఈ కథను కొత్తగా ఎలా చెప్పచ్చు అనేది రైటర్స్ తో డిస్కస్ చేస్తున్నట్టు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఏజెంట్ మూవీని జులై లేదా ఆగష్టు నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని అభిమానులు ఈ సినిమా పై ముఖ్యంగా సురేందర్ రెడ్డి పై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి.. సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కి ఆశించినట్టుగా బ్లాక్ బస్టర్ అందిస్తాడని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్