Sunday, January 19, 2025
Homeసినిమాతెలుగు కంటెంట్‌లో దూసుకుపోతోన్న 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'

తెలుగు కంటెంట్‌లో దూసుకుపోతోన్న ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’

Telugu content on Hotstar:
మన వినోద విశ్వంలో భాగంగా తెలుగు ప్రేక్షకులను అలరిచేందుకు వరుస అనౌన్స్ మెంట్ లతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సిద్దంగా ఉంది. తెలుగులో రాబోతోన్న ఫస్ట్ ఒరిజినల్ హాట్ స్టార్ స్పెషల్ సిరీస్ “పరంపర”తో జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర అలరించబోతున్నారు. నాగార్జున హోస్ట్ చేస్తోన్న ‘బిగ్ బాస్’ లైవ్ షో రాబోతోంది. క్రిష్ డైరెక్షన్‌లో తారకరత్న, అజయ్ కాంబినేషన్‌లో థ్రిల్లింగ్ బ్యాంక్ రాబరీ ‘9 అవర్స్’ చిత్రం రాబోతోంది. మహిళలు, చిన్నపిల్లల మీద జరిగే నేరాలపై ‘ఝాన్సీ’ అనే సినిమా రాబోతోంది. మహి వీ రాఘవ్ దర్శకత్వంలో ‘సైతాన్’ అనే హారర్ సినిమా రెడీగా ఉంది.

డిస్నీ హాట్ స్టార్ గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం వినోద రంగంలో ఇండియా స్థానం మెరుగుపడింది. ఇక ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌తో మన తెలుగు ఇండస్ట్రీ అసోసియేట్ అవ్వడం ఆనందించదగ్గ విషయం. తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు తమ అభిమాన నటీనటులను ఇంకాస్త కొత్త పాత్రల్లో చూడబోతోన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు తెలుగులోని ప్రతిభావంతులైన నటీనటులను, కథలను చూసేందుకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థతో తెలుగులోని స్టార్స్ మరింత వెలిగిపోతారని ఆశిస్తున్నాను. దీనికి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ “ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ ప్రపంచం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోంది. టాలీవుడ్‌లోనూ ఇప్పుడు ఎన్నో ఒరిజినల్ ప్రొడక్షన్స్, క్రియేటివ్‌గా కథలు చెప్పేందుకు ముందుకు వస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్‌ లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి” అన్నారు.

జగపతి బాబు మాట్లాడుతూ “అద్భుతమైన నటీనటులంతా ఒకే చోటకు వస్తే అద్భుతమైన ప్రొడక్ట్ బయటకు వస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అలా అందరినీ ఒకే చోటకు తీసుకొస్తుంది. ప్రెష్ టాలెంట్, క్రియేటివ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ లో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక మున్ముందు తెలుగులో చెప్పే కథల స్థాయి పెరగనుంది” అన్నారు.

Also Read :విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథ ‘రాధేశ్యామ్’

RELATED ARTICLES

Most Popular

న్యూస్